కర్నూలు: అధికారుల అలసత్వం ఇద్దరు విద్యార్థులకు తీవ్ర మనస్థాపానికి గురి చేసింది... ప్రభుత్వం తమకు జారీచేసిన ఫీజు రియంబర్స్మెంట్ గుర్తింపు కార్డుపై వారి ఫోటోలు గల్లంతయ్యాయి... విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో జరిగిన తప్పును వెతికే పనిలో పడ్డారు అధికారులు... ఇంతకు ఆ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలేమిటి...?? అధికారులు చేస్తున్న విచారణ ఏమిటి?? తెలియాలంటే ఈ స్టోరీ పై ఓ లుక్ వేయాల్సిందే

రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం జగనన్న విద్యా దీ వెన... ఈ పథకం ద్వారా చదవడానికి అన్ని అర్హతలు ఉండి ఆర్థిక స్తోమత సరిగా లేని వారి కి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించడమే... అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం కర్నూలు జిల్లాలో అధికారుల నిర్వాకానికి నవ్వుల పాలవుతోంది... ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి ఆయా విద్యార్థులకు సోషల్ వెల్ఫేర్ శాఖ ద్వారా ఐడి కార్డులు మంజూరు చేసింది ప్రభుత్వం... ఆ కార్డులను గ్రామ వాలంటీర్లు సంబంధిత లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది... ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించిన ఈ పథకానికి అర్హులైన వారందరికీ నేరుగా వారి ఇ అకౌంట్లో డబ్బులు కూడా జమ అయ్యాయి... కర్నూలు జిల్లాలో కూడా చాలా మంది విద్యార్థులకు జగన్ అన్న దీవెన పథకం ద్వారా వారి వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి.... డబ్బుల మాట పక్కన పెడితే తమకిచ్చిన ఐడెంటిటీ కార్డుల్లో తమ ఫోటోకు బదులు ఏకంగా సినిమా యాక్టర్ మహేష్ బాబు ఫోటో రావడంతో విద్యార్థులు అవాక్కయ్యారు

Also Read: హీరో మహేష్ బాబుకు జగనన్న విద్యా దీవెన

విజువల్స్ లో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు పరంపోగు లక్ష్మి... ఎమ్మిగనూరు పట్టణంలో హరిజనవాడలో నివాసం ఉంటున్న ఈ అమ్మాయి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.. ఈమె తల్లిదండ్రులు గంగమ్మ సత్యన్న లు రోజువారి కూలి చేసుకుని జీవనం సాగిస్తారు... అధికారులు చేసిన నిర్వాకానికి లక్ష్మి ఓ సెలబ్రిటీ అయిపోయింది... ఇప్పుడు ఎమ్మిగనూరు పట్టణంలో ఎవరి నోట చూసినా లక్ష్మీ మాటనే...దానికి కారణము లక్ష్మికి జారీ చేసిన ఫీజు రియంబర్స్మెంట్ ఐడెంటి కార్డు లో తన ఫోటోకు బదులు సినిమా యాక్టర్ మహేష్ బాబు ఫోటో రావడమే.... ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే..తన పేరు మీద వచ్చిన ఐడెంటి కార్డు తనకు రాకముందే... సోషల్ మీడియా పుణ్యమా అంటూ పెద్ద ఎత్తున అన్ని వాట్సప్ గ్రూపులలో వైరల్ గా మారిపోయింది...

లక్ష్మీ పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇటువంటి సంఘటన మరొక విద్యార్థి ఎదురైంది..పత్తికొండ లోని వైష్ణవి డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న. ఈడిగా లోకేష్ గౌడ్ కు కూడా తన ఫీజు రియంబర్స్మెంట్ ఐడి కార్డులు మహేష్ బాబు ఫోటో రావడంతో అవాక్కయ్యాడు.....తనకు తెలియకుండానే తన స్నేహితులు మిత్రులు పదే పదే ఈ విషయం గురించి ప్రస్తావించడం అపహాస్యం చేయడం తో కాలేజీ కి సైతం రాకుండా ముఖం చాటు చేసుకుంటున్న పరిస్థితి లోకేష్ గౌడ్ ది...  పెరవలి గ్రామం,మద్దికెర మండలానికి చెందిన ఇతను ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు

  తన తోటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కార్లో వచ్చిన తమకు కార్డులు రాకపోయేసరికి అనుమానం వచ్చి వాలంటీర్లను వాకబు చేస్తే అసలు వాస్తవం బయటపడింది...దీంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు లబోదిబోమంటూ కళాశాల యాజమాన్యానికి మొర పెట్టుకున్నారు... ఆ నోటా ఈ నోటా సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇది జిల్లాలో సంచలనంగా మారింది...సినిమా హీరో మహేష్ బాబు ఏకంగా రెండు కాలేజీలో రెండు చోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఐడెంటి కార్డు లు వచ్చేసాయి మరి

విషయం కాస్తా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో దీనిపైన సీరియస్ అయిన జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.... కలెక్టర్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం జరిగిన పొరపాటు పై విచారణను ప్రారంభించిందివిద్యార్థి తమకు విషయం చెప్పగానే పూర్తిస్థాయి ఆధారాలతో ఎంక్వయిరీ కి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యార్థి కచ్చితంగా న్యాయం జరిగేలా తమ ప్రయత్నం చేస్తామని కళాశాల యాజమాన్యం చెబుతోందిఇటువంటి సంఘటనలు వల్ల విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యే అవకాశం ఉంటుందని మండిపడుతున్నారు ఎమ్మిగనూరు వాసులు... ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేలా తప్పు చేసిన అధికారులపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

సరిగ్గా నెల క్రితం కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో సినిమా యాక్టర్ విక్టరీ వెంకటేష్ కు ఓటర్ ఐడి కార్డు రావడం సంచలనం రేపింది... అది పూర్తిగా మర్చిపోకముందే తాజా సంఘటన కలకలం రేపుతోంది... విద్యార్థుల పట్ల ఇటువంటి సంఘటనలు జరగటం వల్ల వాళ్ళు తీవ్ర మనస్థాపానికి గురి అయ్యే అవకాశం ఉంటుందని అది వారి చదువు పై ప్రభావం చూపుతుందని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి...దీనిపై ఉన్నతాధికారులు గట్టి చర్యలు తీసుకొని వాటిని పునరావృతం కాకుండా సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు..