ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు అలీ ఏపీ సీఎం జగన్ కు జైకొట్టారు. ఇందులో భాగంగా ఆయన వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేశారు.

విజయవాడ: విజ‌య‌వాడ‌లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్ధుల గెలుపుvgకు మద్ధతుగా దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావుతో క‌లిసి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు ప్రాంతాల్లో ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు అలీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్న ఏకైక నేత వైఎస్ జగన్ అన్నారు. 

జగన్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాల‌ని కోరారు. అప్ప‌డు వై.ఎస్. పాలన చూశాం..ఇప్పుడు జగన్ పాలనను చూస్తున్నామని అనందం వ్య‌క్తం చేశారు. అన్ని కులాల వారికి న్యాయం చేయాలన్నదే జగనన్న తపన అన్నారు..

విజయవాడ న‌గ‌ర అభివృద్ధికి వంద‌ల కోట్లు రూపాయ‌ల‌ను కెటాయించిన ఘ‌న‌త జ‌గ‌నన్న‌దని అన్నారు. జగన్ ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు.. రోడ్ షో అనంత‌రం భ‌వానీపురం ద‌‌ర్గాలో పూలు ఛాద‌ర్ స‌మ‌ర్పించారు.

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికలను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. నాలుగు రోజుల్లో విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి.