Asianet News TeluguAsianet News Telugu

సినీ పరిశ్రమ బిడ్డగా వచ్చా: జగన్‌తో భేటీ కానున్న చిరంజీవి

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో చర్చించేందుకు తాను అమరావతికి వచ్చినట్టుగా సినీ నటుడు చిరంజీవి చెప్పారు. గురువారం నాడు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో చిరంజీవి హైద్రాబాద్ నుండి గన్నవరం వచ్చారు.

Tollywodd actor Chiranjeevi reaches to Gannavaram airport
Author
Guntur, First Published Jan 13, 2022, 12:23 PM IST


విజయవాడ:  సినీ పరిశ్రమ బిడ్డగా ఏపీ సీఎం Ys Jagan తో చర్చించేందుకు తాను వచ్చినట్టుగా ప్రముఖ సినీ నటుడు చిరంజీవి చెప్పారు.

 గురువారం నాడు Hyderbad బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో  Chiranjeevi గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద చిరంజీవి మీడియాతో మాట్లాడారు.  సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాను  వచ్చినట్టుగా చిరంజీవి చెప్పారు. సీఎం జగన్ తో అన్ని విషయాలపై చర్చిస్తానని ఆయన చెప్పారు. మరో గంటన్నరలో అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని చిరంజీవి తెలిపారు. 

Andhra pradeshప్రభుత్వం ఇటీవల కాలంలో cinema టికెట్ల దరలను తగ్గించింది. సినిమా Tickets ధరలను తగ్గించడంపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  అఖండ సినిమా సక్సెస్ మీట్ లో ఏపీ రాష్ట్రంలో సినీ పరిశ్రమ గోడును వినిపించుకొనేవారెవరున్నారని సినీ నటుడు బాలకృష్ణ ప్రశ్నించారు. Balakrishna వ్యాఖ్యలు చేసిన మరునాడే చిరంజీవితో జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు విషయమై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Perni nani తో ప్రముఖ దర్శకుడు Ramgopal Varma సోమవారం నాడు భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. తన అభిప్రాయాలను వర్మ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ వాదనను కూడా ఏపీ మంత్రి నాని రామ్‌గోపాల్ వర్మ దృష్టికి తీసుకొచ్చారు.

సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై ఎవరైనా తమతో చర్చించేందకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రి నాని చెప్పారు. రామ్‌గోపాల్ వర్మ మాదిరిగానే ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా ప్రభుత్వానికి చెప్పొచ్చన్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశానికి సంబంధించి నిర్మాతలు ఇంకా ప్రభుత్వంతో చర్చించలేదు. onilne టికెట్ వ్యవహరానికి సంబంధించి మంత్రి నానితో నిర్మాతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశంపై మాత్రం నిర్మాతలు ప్రభుత్వంతో ఇంకా భేటీ కాలేదు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ ధరలను తగ్గిస్తే తెలంగాణలో మాత్రం సినిమా టికెట్ ధరల పెంపు విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినీ పరిశ్రమకు అనుకూలంగా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకొంది. సినిమా టికెట్ ధరల విషయమై తాను ఏపీ మంత్రులతో మాట్లాడుతానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Talasani Srinivas Yadav చెప్పారు.

రాష్ట్రంలో corona వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లను నడపాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంతో ఇబ్బంది పడే వాళ్లంతా తమ పినిమాలను వాయిదా వేసుకోవచ్చని మంత్రి నాని సలహా ఇచ్చారు. మరో వైపు నెల్లూరు జిల్లాకు చెందిన  వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినీ పరిశ్రమకు చెందిన వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.ఈ వ్యాఖ్యలను సినీ పరిశ్రమ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios