ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిశారు టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పి వి సింధు. ఈ సందర్భంగా కాంస్య పతకాన్ని తిలకించి అభినందించారు డి‌జి‌పి. మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాదించడం ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన గౌరవమని ఆయన గౌతం సవాంగ్ అన్నారు.

ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిశారు టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పి వి సింధు. ఈ సందర్భంగా కాంస్య పతకాన్ని తిలకించి అభినందించారు డి‌జి‌పి. మన రాష్ట్రానికి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాదించడం ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన గౌరవమని ఆయన గౌతం సవాంగ్ అన్నారు. ఆమె సాధించిన విజయం మహిళలకు, యువతకు ప్రేరణ, స్ఫూర్తి కలిగిస్తుందని డీజీపీ ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి దేశం, రాష్ట్ర యొక్క కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేయాలని డిజిపి కోరారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం, పోలీస్‌‌శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మహిళ దిశ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సింధు కోరారు.