తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీ నుంచి స్వామి వారి నగలు మాయమైన మాట వాస్తవమేనని అధికారులు తేల్చి చెప్పారు.  అదృశ్యమైన ఆభరణాలు పున పరిశీలనలో దొరకలేదని నిర్థారించారు. ఇప్పటికే దీనికి బాధ్యుుడిగా పేర్కొంటూ అప్పట్లో ట్రెజరీ ఇన్ ఛార్జిగా ఉన్న ఏఈవో శ్రీనివాసులు నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తున్న టీడీపీ అధికారులు... ఇప్పుడు అతనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

AlsoReadదర్శనం కోసం మోసం: తిరుమలలో తెలంగాణ అధికారి అరెస్ట్...

టీటీడీ పరిధిలోని ఆయాలకు భక్తులు ఇచ్చే ఆభరణాలను పరిశీలించి రికార్డులో నమోదు చేసిన తర్వాత ట్రెజరీలో భద్రపరుస్తూ ఉంటారు.  2016లో ట్రెజరీ ఏఈవోగా ఉన్న శ్రీనివాసులు బదిలీ అయినప్పుడు పరిశీలించగా 5.40 కేజీల వెండి కిరీటం, బంగారు నాణేలు, వెండి పూత వేసిన రాగి నాణేలు, అల్యూమినియం నాణేలు, రెండు బంగారు ఉంగరాలతోపాటు రెండు నెక్లెస్ లు మాయమైనట్లు గుర్తించారు.

వీటి విలువ రూ.7,36,376గా లెక్క తేల్చారు. శ్రీనివాసులను బాధ్యుడిగా పేర్కొంటూ 2018 నవంబర్ నుంచి అతని జీతంలో నుంచి రూ.25వేలు కట్ చేస్తూ వస్తున్నారు. నగలు మాయమవ్వడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, మరో సారి పరిశీలించాలని శ్రీనివాస్ ఆరు నెలల క్రితం ఉన్నతాధికారులను కోరారు.

టీటీడీ సెప్టెంబరులో పరిశీలన ప్రారంభించి... ఇటీవల పూర్తి చేసింది. అయితే... ఈ పరిశీలనలో మాయమైన ఆభరణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఏఈవో శ్రీనివాసులు నుంచి జరిమానా వసూలును కొనసాగిస్తూనే... తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.