తిరుమలలో తెలంగాణ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డైరెక్టర్ అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం ఐపీఎస్ అధికారినంటూ ప్రోటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శనానికి ఆయన లెటర్ పెట్టుకున్నారు.

Also Read:తిరుమలలో మంత్రి హరీష్ రావుకి ఘోర పరాభవం

ఈ సమయంలో అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉండి... ఐపీఎస్ ఆఫీసర్ అని నకిలీ ఐడీ కార్డుతో అరుణ్ టికెట్లకు దరఖాస్తు చేసినట్లు గుర్తించారు పోలీసులు.

మంగళవారం అరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరుణ్ తెలంగాణలో గ్రూప్-1 ర్యాంక్ అధికారిగా గుర్తించారు. ఈయన మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ వద్ద ఓఎస్‌డీగానూ వ్యవహరించినట్లుగా తెలుస్తోంది.

Also Read:రమణ దీక్షితులు రీ ఎంట్రీ: శ్రీవారి సన్నిధిలో అర్చకుల మధ్య చిచ్చు

గతంలో గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఐఆర్ఎస్ అధికారినంటూ దర్శనానికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నకిలీ ఐడీ కార్డులతో తిరుమల ఆలయ సిబ్బందిని తప్పుదోవ పట్టిస్తున్న వారిని ఉపేక్షించమని, ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేస్తామని టీటీడీ చెబుతోంది.