Asianet News TeluguAsianet News Telugu

16 యేళ్ల బాలికపై 63 యేళ్ల వృద్ధుడి కన్ను.. పెళ్ళిచేసుకుంటానని వేధింపులు.. తట్టుకోలేకే హత్య...

మనవరాలి వయసుండే బాలిక మీద కన్నేసి, పెళ్లి చేసుకుంటానని వేధించడం వల్లే టీటీడీ విశ్రాంత ఉద్యోగి హత్యకు గురయ్యాడని పోలీసులు తెలిపారు. 

tirupati retired employee murder mystery solved
Author
Hyderabad, First Published Aug 11, 2022, 7:44 AM IST

తిరుపతి : 60 ఏళ్ల వృద్ధుడు 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టే వేధింపులు భరించలేక బాలిక కుటుంబ సభ్యులు హత్యకు పాల్పడ్డారని తిరుపతి పడమర డిఎస్పి బారిక నరసప్ప పేర్కొన్నారు. ముత్యాలరెడ్డిపల్లి సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి, ఎస్ఐ వినోద్ కుమార్ లతో కలిసి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన స్థానిక ఉల్లిపట్టెడలో టీటీడీ విశ్రాంత ఉద్యోగి నారాయణస్వామి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితులను ప్రవేశపెట్టారు. ‘ముత్యాల రెడ్డి సమీపంలోని ఉల్లిపట్టెడలో విశ్రాంత ఉద్యోగి నారాయణస్వామి (63) నివసిస్తున్నారు. 

అతని పక్కింట్లో వున్న ఓ బాలిక(16) మీద అతని కన్ను పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ కుటుంబం పెద్దలను అడిగారు. అంత వయసు తేడా ఉంటే ఎలా పెళ్లి చేస్తామని వారు నిరాకరించారు.దీంతో కోపం పెంచుకున్న నారాయణ స్వామి వారితో గొడవలకు దిగేవాడు.. అలా తరువాత జరిగిన గొడవలో తన బంగారు గొలుసును బాలిక తల్లి, తమ్ముడు కాజేశారని నారాయణస్వామి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వాళ్ళను స్టేషన్ చుట్టూ తిప్పించ్చాడు.  అంతటితో ఆగకుండా ఓ రోజు ఆ బాలిక చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళేందుకు ప్రయత్నించాడు.  

దీంతో కుటుంబ సభ్యులు నారాయణ హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 7వ తేదీ  రాత్రి 11.30 గంటలకు నారాయణస్వామి ఆహారం కోసం బయటకు రాగా బాలిక పెద్దమ్మ భారతి(51) అతని వద్దకు వెళ్లి రెండు చేతులు పట్టుకుంది. అదే కుటుంబానికి చెందిన హేమాద్రి(20), రమేష్(47) తీసుకొచ్చిన వీపుపై ఐదు సార్లు పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈనెల 10వ తేదీ రామానుజపల్లి చెక్పోస్ట్ వద్ద ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. 

37యేళ్ల వ్యక్తితో 15యేళ్ల బాలిక ప్రేమ, పెళ్లి వద్దన్నారని సుత్తి, కుక్కర్ లతో కొట్టి.. తల్లిదండ్రుల దారుణ హత్య

ఇదిలా ఉండగా, ముంబైలో ఈ నెల 6న దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు  తేజస్ దల్వీ (24)ని పూణే జిల్లా పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన తేజస్  తల్లి సుజాత దల్వీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత స్థానికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ కోఠార్ణే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అదనంగా పోలీసు బలగాలను మోహరించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెడితే... పూణే జిల్లా మావళ్ తాలూకా కోఠార్ణే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలిక ఈ నెల రెండో తేదీన కనిపించకుండా పోయింది. 

తల్లిదండ్రులు ఊరంతా గాలించినా బాలిక ఆచూకీ లభించలేదు. చివరకు బాలిక తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కూడా తమదైన శైలిలో వెతికారు. గత బుధవారం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాల వెనకాల నగ్నస్థితిలో ఉన్న బాలిక మృతదేహం లభించింది. ఈ వార్త విషయం తెలియడంతో పెద్దసంఖ్యలో గ్రామస్తులు గుమిగూడారు. పోస్ట్ మార్టం రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్లు నివేదిక వచ్చింది. దీంతో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామస్తులు ఆగ్రహాన్ని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి 24 గంటల్లోనే కామాంధుడు తేజస్ దల్వీని అరెస్టు చేసినట్లు సీనియర్ ఇన్స్పెక్టర్ అశోక్ శల్కే వెల్లడించారు. ఆతర్వాత చేపట్టిన విచారణలో తేజస్ నేరాన్ని అంగీకరించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios