తిరుపతిలో  బొలోరే వాహనంలో  గంజాయిని తరలిస్తున్న ఎనిమిది  మంది  సభ్యుల ముఠాను   తిరుపతి పోలీసులు అరెస్ట్  చేశారు.  

తిరుపతి: జిల్లాలోని సూళ్లూరుపేటలో 240 కిలోల గంజాయిని పోలీసులు సోమవారంనాడు సీజ్ చేశారు. గంజాయిని తరలించేందుకు బొలెరో వాహనంలో మార్పులు చేర్పులు చేయించారు. పుష్ప సినిమాలో మాదిరిగా నిందితులు బొలెరో వాహనంలో మార్పులు చేయించారు. బొలెరో వాహనంలో టమాటల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలో గంజాయిని తరలిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బొలోరే వాహనంలో గంజాయి తరలిస్తున్న విషయమై పోలీసులకు కచ్చితమైన సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో బొలెరో వాహనంలో గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న నిందితులు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.

గతంలో ఎర్ర చందనం తరలించేందుకు వాహనాాల్లో మార్పులు చేర్పులు చేసేవారు. కానీ గంజాయి తరలించేందుకు గాను బొలేరో వాహనంలో ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేయడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.