తిరుపతి ఉప ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీని ప్రకటించింది. అభ్యర్థి ప్రకటన అనంతరం బిజెపి-జనసేన ముఖ్య నాయకులు భేటి అవుతారని... ఆ తర్వాత ఇరుపార్టీల ప్రచార కమిటీ ప్రకటిస్తామని బిజెపి చీఫ్ సోము వీర్రాజు వెల్లడించారు. 

తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం రెండంచెల కమిటీని ఏర్పాటు చేస్తామని వీర్రాజు పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్ కమిటీ పార్లమెంట్ ఇంచార్జిగా ఆదినారాయణ రెడ్డిని నియమిస్తున్నట్లు వీర్రాజు తెలిపారు. ఇక ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీలకు కూడా ఇంచార్జీలను నియమించారు. 

ప్రచార కమిటీ ఇదే:

వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.

వాలంటీర్ల కోసం నెలకు రూ.310 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని వీర్రాజు తెలిపారు. నవరత్నాల కోసం ఏర్పాటైన వ్యవస్థ ఎన్నికలను నిరోధిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వీర్రాజు హెచ్చరించారు.