కరోనా కారణంగా మరణిస్తున్న ప్రముఖల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా వైసీపీ నేత, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కోవిడ్ కారణంగా కన్నుమూశారు.

కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అనంతరం అక్కడి చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న దుర్గాప్రసాద్ చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. 

1985లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన దుర్గాప్రసాద్ 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. నెల్లూరు జిల్లా గూడురు  నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన తిరుపతి ఎంపీగా గెలుపొందారు. 

నాటి నుంచి వైసీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఇదే సమయంలో కోవిడ్ ఉద్ధృతి పెరగడంతో ఆయన గూడూరుకే పరిమితమయ్యారు. అయితే ఆ సమయంలో నియోజకవర్గంలో కొన్ని చోట్ల పర్యటించడంతో అప్పుడే ఆయనకు వైరస్ సోకినట్లుగా తెలుస్తోంది.