Asianet News TeluguAsianet News Telugu

జడ్జి పిలిస్తే కోర్టుకు వచ్చాను: కోర్టుకు హాజరైన తర్వాత మోహన్ బాబు

జడ్జి పిలిస్తే కోర్టుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నట్టుగా సినీ నటుడు మోహన్ బాబు చెప్పారు. 2019లో నమోదైన కేసుకు సంబంధించి తిరుపతి కోర్టుకు హాజరైన తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు. 

Tirupati Court Adjourns Mohanbabus  Case Till Sep 20
Author
Tirupati, First Published Jun 28, 2022, 12:33 PM IST

తిరుపతి:Judge  రమ్మంటే వచ్చాం, ఆయన సమక్షంలోనే సంతకాలు పెట్టి వచ్చామని సినీ నటుడు Mohan babu చెప్పారు. 
2019 మార్చిలో నమోదైన కేసుకు సంబంధించి Tirupati కోర్టుకు మోహన్ బాబు తన ఇద్దరు కొడుకులు Vishnu, Manoj లతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు. నిజం చెప్పాలంటే జడ్జి పిలిచారు. వచ్చానన్నారు. జడ్జి సమక్షంలో సంతకం పెట్టినట్గుగా చెప్పారు. పాదయాత్రగా వచ్చామని  ఏ మూర్ఖుడు చెప్పారని మీడియా ప్రతినిధులను మోహన్ బాబు ప్రశ్నించారు.

 జనం ఉండడంతో  కారు నుండి దిగి జనంతో కలిసి నడుచుకుంటూ వెళ్లామన్నారు. మన కోసం వచ్చిన వారిని ప్రేమించాలన్నారు. హ్యాపీగా వాళ్లతో నడిచి కోర్టుకు హాజరైనట్టుగా చెప్పారు.  ఈ కేసు విచారణను కోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. 

2014 నుండి 2019 వరకు  మోహన్ బాబుకు చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ప్రభుత్వం నుండి రాలేదు. దీంతో పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడ  ఈ డబ్బులు చెల్లించలేదని అప్పట్లో మోహన్ బాబు ఆరోపించారు. ఈ విషయమై అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ అధికారులతో మాట్లాడినా కూడా ఫలితం దక్కలేదన్నారు. ఫీజు రీ ఎంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ  2019 ఎన్నికలకు ముందు తన కాలేజీ విద్యార్ధులతో కలిసి మోహన్ బాబు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఆందోళన చేసినందుకు గాను మోహన్ బాబుతో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేఃసులో మోహన్ బాబు ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరయ్యారు.

2019 మార్చి 22వ తేదీన తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్‌, విద్యానికేతన్‌ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. అప్పటి చంద్రగిరి ఎంపీడీవో, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందం అధికారి హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్‌కుమార్‌, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌లు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు.  ధర్నాకు ముందస్తు పోలీసుల అనుమతి లేదని కూడా తెలిపారు. 341, 171(ఎఫ్‌), పోలీస్‌ యాక్ట్‌ 290 కింద చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

also read:నేను బీజీపీ మనిషిని: పాదయాత్రగా తిరుపతి కోర్టుకు హాజరైన మోహన్ బాబు, తనయులు

2019 ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీలో చేరారు. 2019 మార్చి 26న వైసీపలో చేరారు. ఈ ఎన్నికల్లో వైసీపి విజయం కోసం మోహన్ బాబు  ప్రచారం చేశారు.  మోహన్ బాబు పెద్ద కొడుకుకు  వైఎస్ఆర్ కుటుంబానికి బంధుత్వం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios