తిరుపతి: తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలోని రన్‌వే పై ఆదివారం నాడు పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ కు ముందు రన్ వే పరిశీలనకు వెళ్లిన ఫైరింజన్ బోల్తా పడింది. 

ఈ వాహనం బోల్తా పడిన కొద్ది సేపటికే బెంగుళూరు నుండి రేణిగుంటకు ఓ విమానం వచ్చింది. రన్ వే పై ఫైరింజన్ పడిపోయిన విషయాన్ని ఆ విమానం పైలెట్ గుర్తించాడు.  రన్ వే విమానాన్ని ల్యాండ్ చేయకుండా తిరిగి విమానాన్ని బెంగుళూరుకు తీసుకెళ్లాడు. 

రన్ వేపై  ఫైరింజన్  ను పైలెట్ గుర్తించకుండా ల్యాండ్ చేస్తే పెద్ద ప్రమాదం వాటిల్లేది. రన్ వే పై బోల్తా పడిన ఫైరింజన్ ను అధికారులు తొలగించారు. రన్ వేపై ఫైరింజన్ అలాగే ఉండడంతో ఈ విమానాశ్రయంలో విమానాలు ల్యాండ్ కాకుండా తిరిగి వెళ్లిపోయాయి.

ఈ విమానాశ్రయంలో విమానాలు ల్యాండ్ కాకుండా అడ్డుగా ఉన్న ఫైరింజన్ ను వెంటనే అధికారులు తొలగించారు. ఫైరింజన్ తొలగించిన తర్వాత ఈ విమానాశ్రయంలో విమానాలు ల్యాండయ్యాయి.