సినిమా చాన్స్ పేరిట అమ్మాయిలపై లైంగిక వేధింపులు : పోలీసులకు ఫిర్యాదు చేసిన తిరుపతి యువతి

tirupathi young girl cheated by film chans
Highlights

అందమైన అమ్మాయిల ఆర్థిక పరిస్థితిని అదునుగా చేసుకుని ఎరవేస్తున్న కేటుగాళ్లు

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలా మహిళలపై వేధింపులు సినిమా పరిశ్రమలోనే కాకుండా ఆ పేరు చెప్పుకుని బైటకూడా జరుగుతున్నాయి. సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి యువతులను నమ్మించి వారిని లైంగికంగా వాడుకుంటున్న అనేక సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. తాజాగా అలాంటి  మోసానికే ఓ తిరుపతి యువతి బలయ్యింది.

తిరుపతి చెందిన ఓ యువతి తన తండ్రి చనిపోవడం తో తల్లితో పాటు ఉంటోంది. ఈమె షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఈ యువతికి రంగంపేటకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ పరిచయమయ్యాడు. తనకు సినిమాలో చాన్స్ ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్ కు తీసుకువచ్చి ఆమె వద్దగల 20 వేలు తీసుకున్నాడు. అతడికి డబ్బులిచ్చి చాలా రోజులైనా సినిమా అవకాశాలు ఇప్పించకపోవడం, ఫోన్ చేస్తే సరిగ్గా స్పందించకపోవడంతో మోసపోయానని గుర్తించి యువతి తిరిగి తిరుపతికి చేరుకుంది.

అయినా ఈ యువతిని ఫోటో గ్రాఫర్ వదల్లేదు. తన వద్ద ఉన్న యువతి ఫోటోలతో బ్లాక్ మేలింగ్ దిగాడు. తనను కాదని నువ్ ఎలా బతుకుతావో చూస్తానంటూ వాట్సాఫ్, పేస్ బుక్ లో అసభ్య పదజాలంతో మెసేజ్ పంపాడు. దీంతో ఈ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన వెస్ట్‌ సీఐ శ్రీనివాసులు...  బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేసి, న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. 

loader