Asianet News TeluguAsianet News Telugu

టీటీడీ సేవా టికెట్లలో మరో కుంభకోణం

టికెట్ అసలు ధర రూ.240కాగా.. రూ.4000 చెల్లించినట్లు ఆ భక్తులు తెలపడం గమనార్హం. ఇద్దరు భక్తులు రామ్ కుమార్, మరో ఇద్దరు భక్తులు వెంకట రమణ అనే వ్యక్తుల నుంచి ఈ టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. కాగా.. ఈ రామ్ కుమార్, వెంకట రమణలు.. ఆన్ లైన్ లో కొన్ని వేల టికెట్లు బుక్ చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. 

tirupathi.. online seva ticket rocket busted
Author
Hyderabad, First Published Oct 30, 2018, 12:02 PM IST

టీటీడీ ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణం మరోసారి వెలుగుచూసింది. శ్రీవారి ఆర్జిజత సేవల టిక్కెట్లు అక్రమ మార్గంలో దక్కించుకుని, వాటిని అడ్డుగోలుగా అమ్ముకుంటూ దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ ఐడీలతో టీటీడీ వెబ్‌సైట్‌లో ప్రవేశించి, లక్కీడిప్‌లో టిక్కెట్లు పొందుతున్నారు. దీంతో ప్రతి నెల టీటీడీ విడుదల చేస్తున్న సేవా టిక్కెట్లలో సగం కూడా భక్తులకు చేరడం లేదు. ఇటీవల వెలుగుచూసిన సేవా టిక్కెట్ల కుంభకోణంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అడ్డదారుల్లో టికెట్లు పొందినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

కాగా.. సోమవారం  ఇద్దరు వ్యక్తులను విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ ఐడీ కార్డులతో ఆలయంలోకి ప్రవేశించిన శ్రీనివాస్, ధనలక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులను చీఫ్ విజిలెన్స్ అధికారి అడ్డుకోగా.. ఫేక్ ఐడీతో ఆలయంలోకి ప్రవేశించిన మరో ఇద్దరు భక్తులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వీరు.. తెనాలికి చెందిన వెంకట రమణ అనే వ్యక్తి నుంచి  ఈ టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. 

టికెట్ అసలు ధర రూ.240కాగా.. రూ.4000 చెల్లించినట్లు ఆ భక్తులు తెలపడం గమనార్హం. ఇద్దరు భక్తులు రామ్ కుమార్, మరో ఇద్దరు భక్తులు వెంకట రమణ అనే వ్యక్తుల నుంచి ఈ టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. కాగా.. ఈ రామ్ కుమార్, వెంకట రమణలు.. ఆన్ లైన్ లో కొన్ని వేల టికెట్లు బుక్ చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. 

వేలాదిగా నకిలీ ఐడీలు క్రియేట్ చేసి, టీటీడీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుని లక్కీడిప్‌లో టిక్కెట్లు పొందుతున్నారు. ఆర్జిత సేవ టిక్కెట్ల లక్కీడిప్‌లో పాల్గొనేందుకు ఆధార్‌, పాస్‌పోర్టు, ఓటరు కార్డు ఏదో ఒకటి నమోదుచేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి వివరాలు సరైనవా? కాదా అని తెలుసుకునే అవకాశం ఉండదు. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

నకిలీ ఐడీలతో వందలాది టికెట్లు దళారులు దక్కించుకోవడంతో ప్రతి నెలా 10 వేల వరకు టికెట్లు విడుదల చేస్తున్నా వాటిలో సగం కూడా భక్తులకు అందడం లేదు. కాగా.. ఈ కుంభకోణంలో అసలు అక్రమార్కులను పట్టుకునేందుకు విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు.

more related news

తిరుమలలో మరో కుంభకోణం... ఆర్జిత సేవా టిక్కెట్లలో మాయ 

Follow Us:
Download App:
  • android
  • ios