Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో సూట్ కేసులో శవం: మహిళా టెక్కీగా గుర్తింపు, భర్తనే అనుమానితుడు

ఐదు రోజుల క్రితం తిరుపతి రుయా ఆస్పత్రి వెనక కనిపించిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. మహిళా టెక్కీ భువనేశ్వరిని భర్త శ్రీకాంత్ హత్య చేసి ఇక్కడికి తెచ్చి కాల్చివేసినట్లు గుర్తించారు.

Tirupathi dead body mystery busted: Suspecting Husband of the Techie
Author
Tirupati, First Published Jun 28, 2021, 11:20 AM IST

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి రుయా ఆస్పత్రి వెనక కనిపించిన శవం మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఐదు రోజుల క్రితం పోలీసులకు రూయా ఆస్పత్రి వెనక పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ శవం కనిపించింది. ఆ శవం పురుషుడిదా, మహిళదా అనేది కూడా తెలియని స్థితిలో సూట్ కేసులో కుక్కి ఉంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

సెల్ ఫోన్ కాల్స్ అధారంగా దర్యాప్తు చేసి పోలీసులు కేసును ఛేదించారు. మృతురాలిని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భువనేశ్వరిగా గుర్తించారు. ఆమె హైరదాబాదులోని టీఎసిఎస్ లో పనిచేస్తోంది. భర్త శ్రీకాంత్ ఆమెను హత్య చేశాడని అనుమానిస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. శ్రీకాంత్ పనీపాటా లేకుండా జులాయిగా తిరిగేవాడని, డబ్బుల కోసం భువనేశ్వరిని వేధిస్తూ వచ్చేవాడని, ఈ క్రమంలోనే భువనేశ్వరికీ శ్రీకాంత్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు. 

గొడవల కారణంగా శ్రీకాంత్ పక్కా ప్రణాళిక ప్రకారం భువనేశ్వరిని చంపినట్లు భావిస్తున్నారు. ఇంట్లో భువనేశ్వరిని చంపి, శవాన్ని సూట్ కేసులో పెట్టుకుని, ఓ క్యాబ్ డ్రైవర్ ను మాట్లాడుకుని రుయా ఆస్పత్రి వెనక భాగానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. రుయా ఆస్పత్రి వెనక మనుష సంచారం ఉండదు. దీంతో అతను ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్లు భావిస్తున్నారు. రుయా ఆస్పత్రి వెనక శవాన్ని కాల్చేసి, తిరిగి దాన్ని సూట్ కేసులో పెట్టినట్లు అనుమానిస్తున్నారు.

అక్కడే మద్యం సేవించి, శ్రీకాంత్ పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న భువనేశ్వరి మూడు నెలల క్రితం తిరుపతి వచ్చింది. అప్పటి నుంచి శ్రీకాంత్, భువనేశ్వరి కలిసే ఉంటున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. శ్రీకాంత్ కడప జిల్లాకు చెందినవాడు కాగా, భువనేశ్వరి చిత్తూరు రామసముద్రం మండలానికి చెందింది. మూడేళ్ల క్రితం వారికి వివాహమైంది.

భువనేశ్వరి మృతదేహం రెండు రోజుల పాటు రుయా ఆస్పత్రి వెనకనే ఉంది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం.  ఫోరెన్సిక్ నివేదికలో కూడా ఆ శవం మహిళదని తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios