Asianet News TeluguAsianet News Telugu

తిరుమలకు పోటెత్తిన భక్తులు: నిండిపోయిన క్యూలైన్ కాంప్లెక్స్‌లు, నిరంతరాయంగా సర్వ దర్శనం


వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం చేసుకోవడం కోసం రెండు రోజల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో కొన్ని రోజుల పాటు తిరుమలకు భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ చైర్మెన్ సూచించారు.

Tirumala witnesses huge summer rush
Author
Tirupati, First Published May 29, 2022, 9:44 AM IST

తిరుపతి: వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని Tirumalaకు పెద్ద ఎత్తున Devotees వస్తున్నారు.క్యూ లైన్ల నిండా భక్తులు కిలోమీటర్ల దూరంలో Balaji  దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో కొన్ని రోజుల పాటు భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.

Summer సెలవుల నేపథ్యంలో తిరుమలకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సాధారణంగా గంటకు 4500 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే గంటకు సుమారు 8 వేల మందికి దర్శనం కల్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి తప్పలేదని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 60 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఈ కంపార్ట్ మెంట్లలో 4 కి.మీ.మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.  గోదావరి నదికి వచ్చిన వరద మాదిరిగా భక్తులు తిరుమలకు పోటెత్తారని TTD అధికారులు చెబుతున్నారు. వెంకటేశ్వరస్వామిని దర్శించుకొనేందుకు గాను కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శుక్రవారం నుండి భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. శనివారం నాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగింది. తిరుమల కొండలు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లలో శనివారం నాడు ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో నిండిపోయారు.శనివారం సాయంత్రానికి కంపార్ట్ మెంట్ల వేచి ఉన్న భక్తులకు బాలాజీ దర్శనానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

క్యూ లైన్ కాంప్లెక్స్ లోకి భక్తుులు ప్రవేశించడం కోసం క్యూ లైన్ మార్గాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాల్సి వచ్చింది.  శుక్రవారం నాడు దాదాపుగా 73,358 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు 70 వేల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు.  20 వేలకు పైగా మంది భక్తులు క్యూ లైన్లలో స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారాంతపుVIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే  పరిమితం చేశారు. ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలుంటాయని టీటీడీ అధికారుల తెలిపారు.  తిరుమల భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్  సహా కొండపై పరిస్థితిని ఈవో ధర్మారెడ్డి శనివారం నాడు పర్యవేక్షించారు.  తిరుమలకు వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తిరుమలకు రావాలనుకుంటున్న భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా టీటీడీ అధికారులు సూచించాచు.

 భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నిరంతరాయంగా శ్రీవారి సర్వదర్శనం చేసుకోవచ్చని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. . సర్వదర్శనం టోకెన్ల జారీపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ చైర్మన్ YV Subba Reddy అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios