ఇకపై శ్రీవారి నైవేద్యానికి సేంద్రీయ ఉత్పత్తులు.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే

తిరుమల శ్రీవారి నైవేధ్యానికి ఇకపై సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం జరిగింది. 

tirumala tirupati devasthanams board key decisions ksp

వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి నైవేధ్యానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అన్నదానం, లడ్డూ ప్రసాదం తయారీకి కూడా సేంద్రీయ ఉత్పత్తులు వినియోగిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు గాను ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ఛైర్మన్ తెలిపారు. దాతల సాయంతో అందించిన పది లక్షల రూపాయలు వ్యయంతో బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెండి కవచాలు ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

అలిపిరి వద్ద గోడౌన్ల నిర్మాణంకు రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి రూ.14 కోట్లు కేటాయించేందుకు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. పద్మావతి మెడికల్ కాలేజ్‌లో టీబీ విభాగం ఏర్పాటు చేసేందుకు 53.62 కోట్లు కేటాయిస్తామన్నారు. ఢిల్లీలోని ఆడిటోరియం అభివృద్ధి పనులకు 4 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలలో బోధనా సిబ్బంది నియామకానికి అంగీకరించినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులకు రూ.3.12 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. 

Also Read: Tirumala : తిరుమల వెళ్తున్నారా? అయితే, ముందు ఈ విష‌యాలు తెలుసుకోండి.. !

కాగా.. తిరుమ‌ల శ్రీవారి దర్శనానికి భ‌క్తులు పొటెత్తుతున్నారు. వీకెండ్ కావ‌డంతో భ‌క్తులు ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని దేవాల‌య వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల దివ్యదర్శనం టోకెన్లు జారీలో చేసిన మార్పుల‌ను భ‌క్తులు గ‌మ‌నించాల‌ని టీటీడీ సూచించింది. తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకి ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రాన్ని మార్చింది. ఇప్ప‌టివరకూ కాలిబాట, గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేశారు. అయితే, శుక్ర‌వారం నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్యదర్శనం టోకెన్ తీసుకున్నవారు.. అలిపిరి నుంచి నడిచి వెళ్లి గాలిగోపురం వద్ద తనిఖీ కేంద్రంలో ముద్ర వేయించుకోవాల‌ని తెలిపారు. ఇలా చేస్తేనే దర్శనానికి అనుమతి లభిస్తుందని టీటీడీ తెలిపింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios