Asianet News TeluguAsianet News Telugu

ఖరారైన టీటీడీ పాలకమండలి: 75 మందికి చోటు, తెలంగాణ నుంచి 10 మందికి అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకమండలి ఖరారైంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పాలకమండలిలో చోటు కల్పించారట. విధాన నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులుకు ఎలాంటి పాత్ర ఉండదని తెలుస్తోందట. మొత్తం 75 మందితో పాలక మండలి వుండనుందని సమాచారం. 

tirumala tirupati devasthanam new board members confirmed
Author
Tirumala, First Published Sep 14, 2021, 3:20 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న టీటీడీ పాలకమండలి ఖరారైంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి. 25 మంది రెగ్యులర్ సభ్యులతో పాలకమండలి ఉండే అవకాశం వుంది. ఎక్స్‌అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు కొనసాగనున్నారు. అలాగే బ్రాహ్మణ కార్పోరేషణ్ ఛైర్మన్‌గా సుధాకర్ నియమితులైనట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మంది నియమితులైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కోటా నుంచి 10 మందికి అవకాశం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పాలకమండలిలో చోటు కల్పించారట. విధాన నిర్ణయాల్లో ప్రత్యేక ఆహ్వానితులుకు ఎలాంటి పాత్ర ఉండదని తెలుస్తోందట. మొత్తం 75 మందితో పాలక మండలి వుండనుందని సమాచారం. 

ALso Read:ఆయన్ను టీటీడీ బోర్డులోకి తీసుకోండి: ఏపీ సర్కార్‌కు 9 మంది కేంద్రమంత్రుల లేఖ.. ఎవరీ రాధాకృష్ణన్

టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి సిఫార్సులు భారీగా పెరుగుతున్నాయి. చెన్నైకి చెందిన రాధాకృష్ణన్ అనే వ్యక్తికి సభ్యత్వం ఇవ్వాలని సిఫారసులు వస్తున్నాయి. ఏకంగా 9 మంది కేంద్ర మంత్రులు ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాధాకృష్ణన్‌పై తమిళ పత్రికలో పలు కథనాలు వస్తున్నాయి. దీంతో రాధాకృష్ణన్ వ్యక్తిత్వం తెలుసుకుని సిఫారసు వెనక్కి తీసుకున్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.

ఇప్పటికే రాధాకృష్ణన్‌ను చెన్నై లోకల్ టెంపుల్ కమిటీ నుంచి టీటీడీ తొలగించింది. అయితే పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు కోటాలో రాధాకృష్ణన్‌ను తీసుకోవాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఇదే సమయంలో రాధాకృష్ణన్ నియామకం జరిగితే ఉద్యమం చేపడతామని హిందుత్వవాదులు హెచ్చరిస్తున్నారు. రాధాకృష్ణన్‌ను బోర్డులోకి తీసుకోవాలంటూ 9 మంది కేంద్రమంత్రుల సిఫారసు లేఖలు మీడియాకు లీకయ్యాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios