ఆయన్ను టీటీడీ బోర్డులోకి తీసుకోండి: ఏపీ సర్కార్‌కు 9 మంది కేంద్రమంత్రుల లేఖ.. ఎవరీ రాధాకృష్ణన్
టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి సిఫార్సులు భారీగా పెరుగుతున్నాయి. చెన్నైకి చెందిన రాధాకృష్ణన్ అనే వ్యక్తికి సభ్యత్వం ఇవ్వాలని సిఫారసులు వస్తున్నాయి. ఏకంగా 9 మంది కేంద్ర మంత్రులు ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి సిఫార్సులు భారీగా పెరుగుతున్నాయి. చెన్నైకి చెందిన రాధాకృష్ణన్ అనే వ్యక్తికి సభ్యత్వం ఇవ్వాలని సిఫారసులు వస్తున్నాయి. ఏకంగా 9 మంది కేంద్ర మంత్రులు ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాధాకృష్ణన్‌పై తమిళ పత్రికలో పలు కథనాలు వస్తున్నాయి. దీంతో రాధాకృష్ణన్ వ్యక్తిత్వం తెలుసుకుని సిఫారసు వెనక్కి తీసుకున్నారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఇప్పటికే రాధాకృష్ణన్‌ను చెన్నై లోకల్ టెంపుల్ కమిటీ నుంచి టీటీడీ తొలగించింది. అయితే పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు కోటాలో రాధాకృష్ణన్‌ను తీసుకోవాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఇదే సమయంలో రాధాకృష్ణన్ నియామకం జరిగితే ఉద్యమం చేపడతామని హిందుత్వవాదులు హెచ్చరిస్తున్నారు. రాధాకృష్ణన్‌ను బోర్డులోకి తీసుకోవాలంటూ 9 మంది కేంద్రమంత్రుల సిఫారసు లేఖలు మీడియాకు లీకయ్యాయి.