తిరుమల అతిథి గృహంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో ఓ భక్తుడు గాయపడడం స్థానికంగా ఆందోళన కలిగించింది. వివరాల్లోకి వెడితే తిరుమలలోని ఓ అతిథి గృహంలో ప్రమాదం బుధవారం ప్రమాదం జరిగింది. అతిధి గృహంలోని లిఫ్ట్‌ ప్రమాదానికి గురవడంతో ఓ భక్తుడు గాయపడ్డాడు.

అతిథి గృహంలో కరెంట్‌ నిలిచిపోవడంతో రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్‌ ఆగిపోయింది. దీంతో భక్తులను లిఫ్ట్‌ నుంచి బయటకు దించే క్రమంలో ఓ భక్తుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. 

దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక సిబ్బంది వెంటనే తిరుపతిలోని రూయా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సదరు భక్తుడిని వెంకటగిరికి చెందిన జయప్రకాశ్‌గా అధికారులు గుర్తించారు.