తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. 

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శనివారం ఉదయం హనుమంత వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సాంప్రదాయ వేషధారణలు చేసిన ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. 

ఇక బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ వాహన సేవ శుక్రవారం జరిగింది. మలయప్పస్వామి వారు తనకెంతో ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనిమిచ్చారు. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల మధ్య గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. గరుడ వాహన సేవను వీక్షించేందుకు భారీగా తరలివచ్చారు.

Scroll to load tweet…

దీంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగాయి. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు. అంతకుముందు గరుడ వాహన సేవ ప్రారంభానికి ముందు తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి శ్రీవారికి సారె తెచ్చారు. దాదాపు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.