ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో కేశవరెడ్డి బాధితులొకరు కలకలం సృష్టించారు. తనకు డబ్బులిప్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకుని   వచ్చాడు. అయితే, ఈ ప్రయత్నం జరగ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు  జోక్యం చేసుకోవడంతోపోలీసులు ఆయన్ని ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా అడ్డుకున్నారు.

ఏమి జరిగిందో చూడండి...

ఈరోజు  ముఖ్యమంత్రిని కలవడం కోసం కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ఒక వ్యక్తి అమరావతి లో సిఎం ఇంటికి  వచ్చాడు. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. కేశవరెడ్డి విద్యా సంస్థలలో ఐదు లక్షల పెట్టుబడి పెట్టి దివాళ తీశాడు. ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ లేదు. తన పిల్లల గుండె జబ్బుతో బాధపడుతున్నారు. చికిత్స కు డబ్బు లేదు.  డబ్బులు లేక రోడ్డున పడ్డాను అని దీనంగా తన కథ మీడియాకు వివరించాడు. ఇదే గోడు ముఖ్యమంత్రికి  వినిపించుకోవడం కోసం వచ్చాను అని చెప్పాడు. అయితే ఆయనని సెక్యూరిటీ సిబ్బంది మొదట తనిఖీ చేస్తూ ఆ పురుగుల మందు డబ్బా చూసి ఆపేశారు, పక్కకి పంపేసారు. అందుకే ఆయన మీడియాతో తన గోడు చెప్పుకున్నారు. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో రూ. 5 లక్షల పెట్టుబడి పెట్టానని...ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు గుండె జబ్బుతో బాధపడుతున్నారంటూ కంటతడి పెట్టాడు. పదిరోజులైనా సీఎంను కలిసే అవకాశం రాకపోడంతో కలతచెంది ఆత్మహత్యకు యత్నించినట్టు తెలిపాడు. కేశవరెడ్డి నుంచి తన డబ్బులు ఇప్పించాలని వేడుకున్నాడు. ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ లో ఉండడం తో ఆయన్ని కలవడం కూడా కుదరడం లేదనిఅధికారులు చెబుతున్నారు.  ఈ రోజు జరిగిన దానిని  ముఖ్యమంత్రి టివిలలో చూశారు. వెంటనే తన కార్యాలయం కి ఫోన్ చేసి తక్షణం బాధితుడిని ఆదుకోవాలి అని ఆదేశాలిచ్చారని. ఇప్పుడు అతను రాష్ట్ర అధికారుల దగ్గర ఉన్నాడని అధికారులంటున్నారు.