Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పులి సంచారం.. ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు

Srikakulam: ఆంధ్ర‌ప్ర‌దేశ్-ఒడిశా స‌రిహ‌ద్దులో పులి సంచాల‌రం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే పులి సంచారం గురించి అట‌వీ శాఖ అధికారులు ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు పులి సంచారంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. 
 

Tiger movement on Andhra-Odisha border, Srikakulam, Panic among people RMA
Author
First Published Oct 25, 2023, 12:02 PM IST | Last Updated Oct 25, 2023, 12:02 PM IST

Andhra-Odisha Border (AOB): ఆంధ్ర‌ప్ర‌దేశ్-ఒడిశా స‌రిహ‌ద్దులో పులి సంచాల‌రం క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే పులి సంచారం గురించి అట‌వీ శాఖ అధికారులు ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు పులి సంచారంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) గ్రామాల సరిహద్దు గ్రామాల్లో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, గరబండ, రౌతుపురం, రంప, కురాడ, బందహంస సరిహద్దు గ్రామాలలో గత మూడు రోజులుగా పులి సంచరిస్తోందని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) గ్రామాల వాసులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.

ఒడిశా రాష్ట్ర అటవీ అధికారులు అక్టోబర్ 21 నుండి సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పులి సంచారాన్ని నిర్ధారించారు. ఈ గ్రామాలు శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలోని గొప్పిలి, గోకర్ణపురం, చిన్నహంస, భరణికోట, కొలిగాం, కరజాడకు సమీపంలో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. ప‌లు సూచ‌న‌లు చేస్తూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

పులి సంచారం నేపథ్యంలో పాతపట్నం రేంజ్ ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సరిహద్దు గ్రామాల వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాత్రిళ్లు ఒంటరిగా బయటకు రావద్దని చెప్పారు. వన్యప్రాణులను రెచ్చగొట్టి పెంపుడు జంతువులను సంరక్షించాలని కోరారు. పులి సంబంధిత విష‌యాలు తెలిస్తే వెంట‌నే అధికారుల‌కు స‌మాచారం అందించాల‌ని అధికారులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios