Asianet News TeluguAsianet News Telugu

కాకినాడ జిల్లాలో పులి సంచారం: భయాందోళనలో గ్రామస్తులు

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు పరిసరాల్లో పులి సంచారం కలకలం రేపుతుంది. పులి సంచరించే దృశ్యాలు కూడా సీసీటీవీల్లో రికార్డయ్యాయి. దీంతో ఈ పులిని బంధించేందుకు అటవీశాఖాధికారులు చర్యలు చేపట్టారు.
 

Tiger Found In Kakinada District
Author
Guntur, First Published May 29, 2022, 12:19 PM IST

కాకినాడ: Kakinada  జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో Tiger సంచారం సీసీటీవీ పుటేజీల్లో రికార్డైంది. పులి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. .కాకినాడ జిల్లాలోని పోతులూరు వద్ద  పది పశువులను పులి చంపి తింది. దీంతో స్థానిక రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.

Khariff  సీజన్  ప్రారంభం కావడంతో రైతులు  తమ పొలాల వద్దకు వెళ్లాలంటే  పులి ఎప్పుడు ఎక్కడ నుండి వస్తుందని భయపడుతున్నారు. పులి సంచారంానికి సంబంధించి దృశ్యాలు CCTVల్లో రికార్డయ్యాయి. పులిని బంధించేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకొంటున్నారు. 

పులి సంచరించిన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో బోన్లను కూడా ఏర్పాటు చేశారు.  వారం రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.పెద్దపులి కోసం 24 సీసీ కెమెరాలను అటవీశఆఖాధికారులు ఏర్పాటు చేశారు. 120 సిబ్బందిని నియమించింది అటవీశాఖ.


2021 నవంబర్ 5న  కొమురం భీం జిల్లాలో  పెద్ద పులి  హల్ చల్ చేసింది. పెంచికల్ - పేట్‌లోడ్‌పల్లి మధ్యలో గల బ్రిడ్జి దగ్గర పులి సంచరించింది. రోడ్డు దాటుతున్న పులిని చూసిన వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

నిర్మల్ జిల్లాలో  చిరుత  సంచారం భయాందోళన కలిగిస్తోంది. కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసింది చిరుత. ఒక గొర్రెను చంపేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో చిరుత పులులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి రావడం, పశువులను చంపుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొద్దినెలల క్రితం ఇదే నిర్మల్‌ జిల్లా కుభీర్ మండలం జాంగాం గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. పంట పొలాల సమీపంలో అడవి పందిపై చిరు దాడి చేసింది. దీంతో పరిసరాల్లో ఉన్న పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు భయంతో పరుగులు తీశారు. 

నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం భయాందోళన కలిగిస్తోంది. 2021 అక్టోబర్ 12న ఈ ఘటన చోటు చేసుకుంది.  కడెం ప్రాజెక్ట్ ఎడమ కాలువ సమీపంలో గొర్రెల మందపై దాడి చేసింది చిరుత. ఒక గొర్రెను చంపేసి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఆ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఆ వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిశీలించారు. త్వరలోనే దానిని బంధించి తీసుకెళ్తామని, ప్రజలు భయాందోళనకు గురి కావద్దని భరోసా ఇచ్చారు. అలాగే గతంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో పెద్ద పులి సంచారం పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ చిరుత సంచరించడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది.

ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో చిరుత పులులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి రావడం, పశువులను చంపుతుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. కొద్దినెలల క్రితం ఇదే నిర్మల్‌ జిల్లా కుభీర్ మండలం జాంగాం గ్రామ శివారులో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. పంట పొలాల సమీపంలో అడవి పందిపై చిరు దాడి చేసింది. దీంతో పరిసరాల్లో ఉన్న పశువుల కాపర్లు, వ్యవసాయ కూలీలు భయంతో పరుగులు తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios