కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి వరదలో చిక్కుకుని ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. అయితే స్థానికులు ఒకరిని కాపాడగా మిగిలిన వారి ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. 

మామిడికుదురు మండలం అప్పనపల్లి పాశర్లపూడి కాజ్ వే వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వరద ఉధృతికి సమీర్ పాషా అనే యువకుడు కొట్టుకుపోతుండగా రక్షించేందుకు వజీర్, రెహ్మాన్ అనే ఇద్దరు యువకులు ప్రయత్నించారు. ఉధృతికి ముగ్గురు గల్లంతయ్యారు. 

అయితే అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ సూరిబాబు వజీర్ అనే యువకుడిని కాపాడారు. అయితే సమీర్ పాషా, రెహ్మాన్ గల్లంతు అయ్యారు. ఎంత గాలిస్తున్న వారి ఆచూకీ  లభించకపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.  

ఇకపోతే కాకినాడకు చెందిన సమీర్ పాషాకు 15రోజుల క్రితం వివాహం అయ్యింది. తన బంధువల ఇంటికి వెళ్తూ మార్గమధ్యలో ఇలా గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.