తిరుపతి: కరోనా టీటీడీ ఉద్యోగులపై పంజా విసురుతోంది. శుక్రవారం నాడు కరోనాతో  ముగ్గురు ఉద్యోగులు మృతి చెందారు. దీంతో కరోనాతో మరణించిన ఉద్యోగుల సంఖ్య 15 మంది మరణించారు. అన్నదానం డిప్యూటీ ఈవోతో పాటు మరో ఇద్దరు ఇవాళ కరోనాతో మృతి చెందారు.గత ఏడాది కూడ కరోనాతో టీటీడీలో పలువురు మరణించారు. గత ఏదాది ఆగష్టు మాసంలో కరోనాతో 743 మంది బాదపడ్డారు. వీరిలో 402 మంది కరోనా నుండి కోలుకొన్నారు. గత ఏడాదిలో ప్రముఖ అర్చకులు కూడ కరోనా కారణంగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది కరోనా కేసులు పెరగకుండా టీటీడీ పాలకవర్గం, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే తిరుపతిని కంటైన్మెంట్ జోన్ గా  అధికారులు ప్రకటించారు. వ్యాపారులు కూడ  మధ్యాహ్నం వరకు దుకాణాలు తెరుస్తున్నారు. చిత్తూరు జిల్లాలో పలు పట్టణాల్లో మినీ లాక్‌డౌన్ ను విధించారు.కడప, శ్రీకాకుళం జిల్లాల్లో కూడ  మినీ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు తీసుకొంటుంది.