వేసవి సెలవుల్లో నెల్లూరు పెన్నా నదిలో, స్థానికంగా ఉండే చెరువులు, గుంటల్లో ఈతకొట్టడానికి వెళ్లే విద్యార్థులారా ఒక్క నిమిషం ఆలోచించండి. ఈత వచ్చుకదా అని లోతు తెలియకుండా గుంటల్లో దిగితే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో ఈ వీడియోలో చూడండి. సెల్ ఫోన్ లో వీడియో రికార్డింగ్ ఆన్ చేసి మరీ ముగ్గురు స్నేహితులు నీటిగుంటలో దిగారు. ముగ్గురూ ఈతవచ్చినవాళ్లే, కానీ వీరిలో ఒక్కడే బతికాడు. మిగిలిన ఇద్దరూ ఒకరికొకరు అన్నట్టుగా నీటమునిగి చనిపోయారు.