చిత్తూరు జిల్లా పుత్తూరులో అప్పలు బాధ తాళలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు. శంకరయ్య ఆయన భార్య గురవమ్మ చిన్న కొడుకు వినయ్ లు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు.  పెద్ద కొడుకు సతీష్ చేసిన అప్పులతో  ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకొన్నారు.

చిత్తూరు:పెద్ద కొడుకు చేసిన అప్పులకు తల్లిదండ్రులు సహా చిన్న కొడుకు ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రాచపాలెంలో గురువారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంది. శంకరయ్య, గుర్వమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సతీష్ వ్యాపారం కోసం తెలిసిన వారి నుండి కోటిన్నర అప్పులు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అప్పులు ఇచ్చిన వారి ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో సతీష్ ఇంటి నుండి పారిపోయాడు. అప్పుల వారి నుండి ఒత్తిడి పెరగడంతో మిగిలిన ముగ్గురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

శంకరయ్య, గురవమ్మ, చిన్న కొడుకు వినయ్ గురువారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ విషయమై పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.