అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ముగ్గురు నానీలు ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేబినెట్ లో బెర్త్ కన్ఫమ్ చేసుకున్నారు. 

పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని, అలాగే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినానీలకు జగన్ కేబినెట్ లో బెర్త్ లు కన్ఫమ్ చేసుకున్నారు. 

గత ఎన్నికల్లో వరుసగా కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి గెలుపొందుతుండగా ఆళ్లనాని, పేర్నినానిలు ఓటమి పాలవుతున్నారు. అయితే ఈసారి వైసీపీలో ఉన్న ముగ్గురు నానీలు గెలిచారు. దీంతో ఈ ముగ్గురు ఒకేసారి జగన్ కేబినెట్ లో మంత్రి పదవులు దక్కించుకున్నారు. 

ముగ్గురు కూడా తొలిసారిగా మంత్రి వర్గంలో చోటుదక్కించుకోవడం విశేషం. ఇకపోతే ఈ నాని పేర్లు కేవలం ముద్దు పేర్లు మాత్రమే. వీళ్ల అసలుపేర్లు వేరుగా ఉన్నాయి. ఇకపోతే ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాసరావు కాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అయితే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అసలు పేరు పేర్ని వెంకట్రామయ్య. అయితే రాజకీయాల్లో మాత్రం వీరు నానీలుగానే గుర్తింపు పొందారు.