న్యూఢిల్లీ: ఏలూరులో వింత వ్యాధితో ఇబ్బంది పడుతున్న రోగులను పరీక్షించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం  బృందాన్ని పంపనుంది. 

శనివారం నుండి వింత వ్యాధితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.  వింత వ్యాధి సోకడానికి గల కారణాలపై కేంద్ర బృందం ఆరా తీయనుంది. కేంద్ర ప్రభుత్వం పంపే బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రోఫెసర్ డాక్టర్ అవినాష్, డియోస్టవర్, వైరాలజిస్ట్ డాక్టర్ సంకేత్ కులకర్ణిలు ఉన్నారు.

also read:అంతుచిక్కని వ్యాధి: ఏలూరుకు రానున్న ఎన్‌హెచ్‌డీసీ బృందం...

ఈ బృందం రేపు సాయంత్రానికి కేంద్రానికి ప్రాథమిక నివేదికను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది.  ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది.

శనివారం నుండి ఏలూరులొో వింత వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 340 మంది రోగులు ఇప్పటికే ఈ వ్యాధిబారిన పడ్డారు. ఈ వ్యాధితో ఒకరు మరణించారు. ఏలూరులో చికిత్స పొందుతునన్ బాధితులను సీఎం వైఎస్ జగన్ ఇవాళ పరామర్శించారు. ఈ వ్యాధి ఎలా సోకుతుందనే విషయమై ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. దీంతో కేంద్ర బృందం బాధితులను పరీశీలించనుంది