కాకినాడలో రోడ్డు ప్రమాదం: బైక్, ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు మృతి
కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం కొత్త ముసలయ్యపేట వద్ద ట్రాక్టర్, బైక్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు.
కాకినాడ: జిల్లాలోని తొండంగి మండలం కొత్త ముసలయ్యపేట వద్ద ట్రాక్టర్ ను బైక్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు.దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ సహా 19 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరిగింది.
శ్రీకాకుళం నుండి పాతపట్నం నుండి ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో అదుపు తప్పి బోల్తా పడింది. ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోయింది. కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు మృతి చెందారు.ఆగిఉన్న లారీని జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ నెల 4వ తేదీన ఏపీ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో టిప్పర్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వినాయకుడి గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ నెల 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో
ఏడుగురు మృతి చెందారు. ఈ నెల 12న తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పేర్లపాకలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.కారు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఏడాది మే 30వ తేదీన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణీకులు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.మహారాష్ట్రలోని కాన్సా లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 4వ తేదీన కారు ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
రాజస్థాన్ లో ఈ ఏడాది మే 30న జరిగిన రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మానసమాత ఆలయానికి ట్రాక్టర్ లో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి 80 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు.