వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ అదుపుతప్పి రోడ్డు పక్కన భోజనం చేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లింది.

వైఎస్సార్ జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మలమడుగు మండలంలో గొరిగినూరు దగ్గర రోడ్డు పక్కన భోజనం చేస్తున్న కూలీలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు కూలీలు, టిప్పర్ డ్రైవర్ ఉన్నారు. అతి వేగం వల్లే టిప్పర్ అదుపుతప్పినట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేసుకుని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడున్నవారిని అడిగి తెలుసుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మృతులను ధర్మాపురం గ్రామానికి చెందిన నాగ సుబ్బరాయుడు, గొరగనూరు గ్రామానికి చెందిన ఓబులేసు లుగా పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.