కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడు.. ఎవరిని ఈ మహమ్మారి కబళించేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. కాగా.. తాజాగా ఈ కరోనా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు ఈ మహమ్మారికి బలయ్యారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన డకర కృష్ణనాయుడు (63), భార్య చిన్నమ్మడమ్మ (58), కుమార్తె జానకమ్మ (39) కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. వీరిలో చినమ్మడమ్మ ఇంటివద్దనే చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 29వ తేదీ చనిపోయారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే కృష్ణంనాయుడు కూడా ఇంటి వద్దే ఈ నెల తొమ్మిదో తేదీన ఇంటి వద్దే ప్రాణాలు కోల్పోయాడు. దంపతుల మరణంతో కుటుంబ సభ్యులతోపాటు స్థానికులంతా తీవ్ర విషాదానికి గురయ్యారు. ఇంతలోనే ఆ ఇంట్లో మరో ఘోరం చోటుచేసుకుంది. జానకమ్మ కూడా ఈ నెల 24వ తేదీన శ్రీకాకుళంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది.