తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరిపట్నంలోని ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మృతులను చాగల్లుకు చెందిన మహీధర్, దేవరపల్లి మండలం త్యాజంపూడికి చెందిన రత్నబాబు, గౌరీపట్నానికి చెందిన సత్యనారాయణగా గుర్తించారు.

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరిపట్నంలోని ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. మిథనాల్ ప్లాంట్ వద్ద కంజెక్షన్ యూనిట్ వద్ద పనిచేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను చాగల్లుకు చెందిన మహీధర్, దేవరపల్లి మండలం త్యాజంపూడికి చెందిన రత్నబాబు, గౌరీపట్నానికి చెందిన సత్యనారాయణగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిథనాల్ ప్లాంట్‌లోని కెమికల్ కాలమ్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.