ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీటీపీఎస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వీటీపీఎస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీటీపీఎస్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. వీటీపీఎస్‌లో లిఫ్ట్ వైర్ తెగిపడింది. దీంతో లిఫ్ట్ అమాంతం కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్‌లో 8 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred