Asianet News TeluguAsianet News Telugu

పెళ్లాయ్యాక కూడ ప్రియుడితో ఎంజాయ్: వద్దన్నందుకు భర్తకు షాకిచ్చిన భార్య

 పెళ్లికి  ముందే  ఏర్పడిన లైంగిక బంధాన్ని  పెళ్లి తర్వాత కూడ కొనసాగించింది ఓ వివాహిత. ఈ బంధం ఎంతవరకు వెళ్లిందంటే ప్రియుడి కోసం  భర్తను కూడ చంపించింది

three held for Nataraj murder case in Vishaka district

విశాఖపట్టణం: పెళ్లికి  ముందే  ఏర్పడిన లైంగిక బంధాన్ని  పెళ్లి తర్వాత కూడ కొనసాగించింది ఓ వివాహిత. ఈ బంధం ఎంతవరకు వెళ్లిందంటే ప్రియుడి కోసం  భర్తను కూడ చంపించింది. భర్తను  చంపించిన కేసులో ప్రియుడితో పాటు వివాహితను వారికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన  విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.

విశాఖ జిల్లాలోని జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన మినరల్‌ వాటర్‌ కేన్‌లు ఇంటింటికీ సరఫరా చేసే మురళికి పార్వతి అనే వివాహితతో వివాహేత సంబంధం ఏర్పడింది. పెళ్లికి ముందు నుండే వీరిద్దరి మధ్య లైంగిక బంధం ఏర్పడింది. పార్వతికి నటరాజుతో వివాహమైంది. అయితే పెళ్లి తర్వాత కూడ పార్వతి  మురళితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.12 ఏళ్ల క్రితం  కొబ్బరి తోటకు చెందిన నటరాజుతో  పార్వతికి వివాహమైంది.

పెళ్లైన తర్వాత కూడ  మురళీ స్నేహితుడు గణేష్ రూమలో పార్వతి, మురళీ తరచూ కలుసుకొనేవారు. గణేష్ రూమ్ కొమ్మాది ప్రాంతంలో ఉండేది. అయితే జీవనం కోసం నటరాజ్ దుబాయ్ వెళ్లాడు. భర్త దుబాయ్ వెళ్లడంతో  పార్వతి, మురళీ బంధానికి అడ్డు లేకుండా పోయింది.

వీరికి అడ్డు చెప్పేవారు లేకుండాపోయారు. దుబాయ్ నుండి మురళీ ఇటీవలనే తిరిగొచ్చాడు.  అయితే మురళీతో తన భార్య పార్వతి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయం నటరాజ్‌కు తెలిసింది. దీంతో నటరాజ్ భార్యతో పాటు మురళీని తీవ్రంగా మందలించాడు.

తన భార్యతో  సంబంధాలను తెంచుకోవాలని హెచ్చరించాడు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. అయితే పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీంతో నటరాజ్ మురళిపై దాడి చేశాడు. దీనిపై  మురళి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భార్య ప్రవర్తన కారణంగా  కుటుంబంలో గొడవలు పెరుగుతున్నాయని భావించాడు నటరాజ్ .. దీంతో అతను  ఇల్లును కొబ్బరితోట నుండి బాపూజీనగర్ ప్రాంతానికి మార్చాడు.  ఆరు మాసాల క్రితమే బాపూజీ నగర్ లో  అద్దె ఇంట్లోకి మారాడు. అయినా కూడ పార్వతిలో మార్పు రాలేదు. మురళితో ఆమె తన సంబంధాలను కొనసాగిస్తోంది. దీంతో భార్య,భర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.

దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ఆమె భావించింది. ఈ మేరకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఆన్‌లైన్‌లో కత్తిని కొనుగోలు చేశారు పార్వతి, మురళిలు. ఈ నెల 18వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో 104 ఏరియా నుంచి నటరాజ్‌ నడుచుకుంటూ బాపూజీనగర్‌లోని ఇంటికి వస్తున్నాడు. 

ఆ సమయంలో  అక్కడే మాటువేసిన  మురళి, గణేష్‌లు  బీరుబాటిళ్లతో నటరాజ్‌పై దాడి చేశారు.  ఈ దాడితో కిందపడిపోయాడు నటరాజ్. వెంటనే తమ వెంట తెచ్చుకొన్న కత్తితో మురళి.. నటరాజ్‌పై కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు.నటరాజ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ కేసును విచారించిన పోలీసులు మురళి,గణేష్‌లతో పాటు భార్య పార్వతిని కూడ అరెస్ట్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios