దేశ వ్యాప్తంగా ఆనందంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. కాగా.. ఈ దీపావళి వేడుకల్లో అపశృతి  చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ జిల్లా చోడవరం రామ్మోహనపేట( అన్నవరం) లో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి పండగ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఇంట్లో మందుగుండు తయారు చేస్తుండగా.. అది ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే ముగ్గురు చిన్నారులకు ప్రథమ చికిత్స నిమిత్తం చోడవరం తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలించారు. కాగా.. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  గాయపడిన చిన్నారులు పెన్నడ మహేష్, తలారి జ్యోషిత్ , శివలంక నిఖిల్ గా గుర్తించారు. కాగా..  పండగ రోజే ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నారులకు కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.