అమరావతి: శాసన మండలి పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. తన నివాసంలో విజయసాయిరెడ్డితో సీఎం జగన్ సమాలోచనలు జరిపారు.  న్యాయ,రాజ్యాంగ పరమైన అంశాలపై  జగన్ చర్చిస్తున్నారు. మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయాన్నికూడా పరిశీలిస్తున్నారు.

అసెంబ్లీని ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  జగన్ తో సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ ముకుల్ రోహిత్గితో భేటి అయ్యారు. న్యాయ, రాజ్యాంగ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.మూడు రాజధానులపై హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై, ప్రభుత్వం తరపున రోహిత్గి వాదనలు  వినిపించనున్నారు. 

Also Read: మూడు రాజధానులకు కేంద్రం అనుమతి లేదు:పవన్ కళ్యాణ్

పాలనా వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఎ రద్దు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.

అసెంబ్లీకి టీడీపీ గైర్హాజర్

నేడు శాసన సభ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించంది. అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయంనిర్ణయం తీసుకుంది. బుదవారం మండలిలో జరిగిన పరిణామాలపై టిడిపి తీవ్ర అసంతృప్తితో ఉంది. నిరసనగా సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.

Also Read: మండలికి తాగి వచ్చారు.. యనమల షాకింగ్ కామెంట్స్

కొనసాగుతున్న ఆందోళన

అమరావతి రైతుల రైతుల ఆందోళన బుధవారంనాడు 37 వరోజు కొనసాగుతోంది. తుళ్ళూరు, మందడం గ్రామాల్లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. వెలగపూడిలో 37 వరోజు రిలేనిరాహార దీక్ష జరుగుతోంది. నీతికి నిజాయితీ కి మారుపేరుగా మండలి చైర్మన్ షరీఫ్ నిలబడ్డారని రాజధాని గ్రామాల్లో రైతులు షరీఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.