ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు చిన్నారులు మరణించారు. వివరాల్లోకి వెళితే.. సంతమాగులూరు మండలం కొప్పవరంలోని కోదండరామ స్వామి ఆలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొందరు చిన్నారులు జెండా దిమ్మెలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇనుప రాడ్ పైనున్న విద్యుత్ తీగలకు తగలడంతో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మరణించారు. వీరంతా ఐదో తరగతి విద్యార్ధులుగా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ముగ్గురు బాలల మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.