ఏపీ కేబినెట్ పునర్వ్యస్ధీకరణ సందర్భంగా తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై స్పందించారు అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. జిల్లాలోని సమీకరణలు, సామాజిక సమీకరణల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని స్పష్టం చేశారు.
ఏపీలో ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (ap cabinet reshuffle) జరిగిన సంగతి తెలిసిందే. అయితే, మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంతో మందికి నిరాశ తప్పలేదు. పాత మంత్రులు కూడా మరో ఛాన్స్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. కొందరు రాజీనామాలకు సిద్ధమవ్వగా.. మరికొందరు అనుచరుల చేత నిరసనలు, ధర్నాలు చేయించారు. కాగా.. ఈ సారి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంచనా వేసిన వారిలో అనంతపురం (anantapur district) జిల్లా రాప్తాడు ఎమ్యెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (thopudurthi prakash reddy) కూడా ఒకరు. జిల్లాలో బలమైన పరిటాల రవి కుటుంబాన్ని ఎదుర్కొంటూ వస్తున్న ఆయనకు బెర్త్ ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ ప్రకాశ్ రెడ్డికి అవకాశం దక్కలేదు.
ఈ నేపథ్యంలో తోపుదుర్తి మాట్లాడుతూ తనకు మంత్రి పదవి రాకపోవడానికి గల కారణాన్ని వివరించారు. జిల్లాలోని సమీకరణలు, సామాజిక సమీకరణల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని స్పష్టం చేశారు. జిల్లాలోనే అతి పెద్ద నియంతృత్వ కుటుంబాన్ని మట్టికరిపించామని అన్నారు. రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం మాత్రం తనకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఉండాలని వైయస్సార్ చనిపోయిన మూడో రోజే జగన్ తనకు చెప్పారని... అందుకే మంత్రి పదవి కోసం తాను ఎదురు చూడటం లేదని వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం రెండో స్థానంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారని, మూడో స్థానంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారని తోపుదుర్తి వ్యాఖ్యానించారు.
మరోవైపు మంత్రివర్గ విస్తరణ తర్వాత నెల్లూరు జిల్లాలోని YCPలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. నేతల మధ్య ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు బహిరంగమయ్యాయి. నెల్లూరు జిల్లా నుండి kakani Govardhan Reddyకి మంత్రివర్గంలో జగన్ స్థానం కల్పించారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో ఆయన వైరి వర్గం అసంతృప్తితో ఉంది. మంత్రివర్గంలో తనకు చోటు దక్కకపోవడంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే kotamreddy Sridhar Reddy విలపించారు. కార్యకర్తలు శ్రీధర్ రెడ్డి ఓదార్చారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చురుకుగా పాల్గొంటున్నారు.ఈ సమయంలో గురువారం నాడు మాజీ మంత్రి Anil kumar Yadav కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ అయ్యారు.
కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కాలేదు. అయితే ఈ కార్యక్రమానికి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నుండి ఆహ్వానం రానందునే తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ తేల్చి చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు ఎలా సహకరించారో అంతకు రెట్టింపు సహకరిస్తానని కూడా అనిల్ కుమార్ వ్యంగ్యంగా చెప్పారు.
