కూలేందుకు సిద్ధంగా ఉన్నా, ఎమ్మార్వో ఇక్కడి నుంచే పనిచేస్తారు, మరో మార్గం లేదు ఆంధ్రలో... 

ఇదేదో పాడుపడిన భూత్ బంగ్లాయో, విజయ నగర రాజులు చివరి విడిదియో అనుకుంటున్నారా... కాదు కాదు. 

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మార్వో ఆఫీస్.

కూలేందుకు సిద్ధంగా ఉంది. అయినా సరే రోజూ, మన ఎమ్మార్వో ధైర్యంగా ఇందులో నుంచే పనిచేస్తున్నారు.

అయితే, ఆఫీసు లో ఎవర్నడిగినా భయం బయటపెడతారు.

ఎపుడో కూలుతుందో నని ఆందోళన వాళ్లలో కనబడుతుంది.

అయితే, వాళ్లు అమాయకులు..

ఓపిక లేదు. త్యాగం చేయడం తెలియదు.

ఇపుడు ప్రభుత్వం అర్జంటుగా రాజధాని కట్టే పనిలో ఉన్నపుడు ఇలాంటి చిల్లర సమస్యలు తీసుకువస్తున్నారు.

కొద్దిరోజులాగ లేరా?

2019 నాటికి దేశంలో మొదటి మూడు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటవుతున్నది. 2020 నాటికి దేశంలో నెంబర్ వన్ అవుతున్నది. 2050 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటవుతున్నది. అప్పటికి వర్ ల్డ్ క్లాస్ఎమ్మార్వోలు, వర్ల్ ల్డ్ క్లాస్ ఆపీసులొస్తాయి. సింగపూర్ స్టయిల్లో కడతారుగా.

అలాంటపుడు ఇలా.. పాత బంగ్లా అని రోజు పొద్దున రాగానే ఎలా రా దేవుడా అని, సాయంకాలం వెళ్లిపోయాటపుడు ఒక బతికాం రా దేవుడా అనుకుంటూ పోవడం ఏమిటి?

ఇదంతా అభివృద్ధిని అడ్డుకుంటున్న అపోజిషనోళ్ల కుట్ర.