ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ ‌రెడ్డిని ఉద్దేశిస్తూ సినీనటుడు థర్గీ ఇయర్స్ పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టిన రోజే జగన్ విజయం సాధించారన్నారు.

శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పృథ్వీ మీడియాతో ముచ్చటించారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన తీర్పునే.. మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్‌కు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు.

మరో నటుడు కృష్ణుడు మాట్లాడుతూ జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి తామంతా విజయవాడ వెళుతున్నామని తెలిపారు. సంగీత దర్శకుడు ఆదిత్య రూపొందించిన ఓ పాటను బెజవాడలో ఆవిష్కరిస్తామని కృష్ణుడు వెల్లడించారు.