దొంగలు ఎంత బీభత్సం చేశారో? దంపతుల దారుణ హత్య

First Published 17, Mar 2018, 12:09 PM IST
Thieves murdered wife and husband in gudivada
Highlights
  • కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.

కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. రాజేంద్రరనగర్‌ నాలుగో లైన్‌లో నివాసం ఉంటున్న బొప్పన సాయిచౌదరి (72), నాగమణి (67) ఇంట్లోకి దుండగులు చొరబడి వారిని తీవ్రంగా కొట్టారు. తర్వాత ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నారు. అంతేకాకుండా ఇంటి ముందున్న వారి కారులోనే దర్జాగా పారిపోయారు.  

ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి హాల్‌లో రక్తం మడుగులో పడిఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌ మార్టంకు తరలించారు.  మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరిస్తోంది. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

కాగా ఈ హత్యకు పాల్పడింది దోపిడీ దొంగలా లేక ఇరతర్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపింది.

 

 

 

loader