క్రిష్ణా జిల్లా, గన్నవరం మండలం అవుటపల్లి లో ఉన్న పిన్నమనేని కరోన ఆసుపత్రి లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఓ వైపు కరోనా వైరస్ తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం చేయించుకుంటున్న బాధితులకు కొత్త బెడద పట్టుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కరోనా పాజిటివ్ తో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ఐసీయూకే పరిమితమైన వారికి ఫోన్ ఒక్కటే తమ ఆప్తులను కలిపే సాధనం. అయితే దొంగలు దాన్నీ వదలిపెట్టడంలేదు. కరోనాకు కూడా భయపడకుండా పేషంట్ల ఫోన్లను కొట్టేస్తున్నారు. 

దీంతో ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక... ఎవరికి చెప్పుకోవాలే తెలియక పేషంట్లు అయోమయంలో పడిపోయారు. ఒకేరోజు కరోనా వార్డు నుంచి నాలుగు ఫోన్లు పోవడంతో పేషంట్లు ఆందోళనలో పడిపోయారు.

వార్డులోని తమ వారు ఎలా ఉన్నారో తెలియక కరోనా పేషంట్ల బంధువులు, కుటుంబసభ్యులు.. ఇబ్బంది పడుతున్నారు. అయితే కరోనా పేషంట్ల వార్డులోకి బయటివారు ఎలా వచ్చారు? అనే సందేహం తలెత్తుతుంది. ఇది హాస్పిటల్ సిబ్బంది పనేనా? అనే అనుమానాలు కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు.