హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌న్న వైసీపి నేత శిల్పా చ‌క్ర‌పాణి. అభిరుచి మధు దాడి చేశారన్నారు. తుపాకీతొ, వేట కొడవళ్లతో దాడి
తన పై హత్యాయత్నం జరిగిందని వైసీపి నేత శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఉదయం చక్రపాణి రెడ్డి హత్యయత్నం జరిగిన సంగతి అందరికి తెలిసిందే. అదే విషయంపై శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ఘటనను వివరించారు.
అంత్యక్రియల కోసం వెళ్తున్న తమని సూరత్ గ్రాండ్ హోటల్ వద్ద టీడీపీ నేతలు అడ్డుకుని దాడికి దిగారని ఆయన తెలిపారు. తుపాకులతో, వేట కొడవళ్లతో తమపై దాడికి దిగారన్నారు. కాల్పులు జరిపింది రౌడి షీటర్ అభిరుచి మధునే అని చక్రపాణి రెడ్డి పెర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలు తమ పైకి దాడికి దిగారని ఆరోపించారు చక్రపాణి రెడ్డి. అభిరుచి మధు తన చేతిలో గన్ పట్టుకొని తమ పైకి దూసుకు వచ్చాడని తెలిపారు శిల్పా చక్రపాణి. తమ చుట్టు ఉన్నవారు నిలువరించడానికి ప్రయత్నించినా మధు ఏమాత్రం ఆగలేదని ఆయన తెలిపారు. తమ వాహనాలను అడ్డుకున్నారని, వాహానాలను ముందుకు వెనక్కి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇదేంటని తమ వాళ్లు ప్రశ్నిస్తే.. మీ సంగతి చూస్తామని బెదిరింపులకు దిగారని, వారిని నిలువరించడానికి ప్రయత్నిస్తే వాళ్ల చేతుల్లో గన్లతో తమపైకి దాడికి దిగారని ఆయన పెర్కొన్నారు. వేట కొడవళ్లతో టీడీపీ నేతలు దాడికి దిగారని ఆయన పెర్కొన్నారు. పక్కన ఉన్న పోలీపులు కూడా కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు.
శిల్పా చక్రపాణి పై దాడిని వైసీపి నేతలు అంబటి రాంబాబు, శీకాంత్ రెడ్డి ఖండించారు.
