జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్దంగా ఉండాలని ఆయన కోరారు. 


అమరావతి:జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు పార్టీ నేతలంతా సిద్దంగా ఉండాలని ఆయన కోరారు. 
మంగళవారం నాడు టిడిపి సీనియర్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన పార్టీ నేతలతో మాట్లాడారు.
తిరుపతి పార్లమెంటు ఎన్నికలపై దృష్టిసారించాలని ఆయన పార్టీ నేతలను కోరారు. 

రైతుల పంటల భీమాపై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్రభుత్వం అన్నీ అబద్దాలు చెప్పిందన్నారు. ఇప్పుడు రూ 1250 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన ఇచ్చాడు. కానీ జిల్లాల లెక్కలు చూస్తే అది కేవలం రూ. 921 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు.

వరదల్లో నష్టపోయిన ధాన్యాన్ని కొనడం లేదు. అప్పులు తెచ్చుకోవడానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. అవనిగడ్డలో వారంలో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులు పాలిట ఈ ప్రభుత్వం శాపంగా మారింది. ఎన్యుమరేషన్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదన్నారు.

ప్రజారాజధాని అమరావతి పోరాటానికి ఏడాది అవుతుందని ఆయన చెప్పారు. రాజధాని విషయంలో ఒక్క వైసీపీ మినహా అన్నీ పార్టీలు రాజధాని అమరావతికి మద్దత్తు తెలుపుతున్నాయన్నారు.

 రాజధాని కోసం రాష్ట్ర ప్రజలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వారి పోరాటాలు వృదాపోదు. వారు తప్పక విజయం సాధిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.డిసెంబర్ 25 న వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ టిడిపి విజయమన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై చంద్రబాబునాయుడుతో పలువురు పార్టీ నేతలు చర్చించారు.