Asianet News TeluguAsianet News Telugu

అక్క‌డ డేరా బాబా ఇక్క‌డ జ‌గ‌న్ బాబా

  • విశ్వ‌స‌నీయ‌త‌ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల ద్వారా రాదు.
  • జ‌గ‌న్‌ ఉప ఎన్నిక‌ల్లో హాద్దులు దాటి ప్ర‌వ‌ర్తించారు.
  • రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాలి.
  • సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోతే ఎక‌గ్రీవం.
  • నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిని పెట్టి అభాసుపాల‌యింది.
there dera baba hear jagan baba

అక్క‌డ డేరా బాబా, రాష్ట్రంలో జ‌గ‌న్ బాబా స‌మాజాన్ని త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తున్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. నంద్యాల విజయం చారిత్రాత్మక విజయమని ముఖ్య‌మంత్రి అభివర్ణించారు. గెలుపును ముందే ఊహించానని ఆయన వెల్లడించారు. ఒక్క తెలుగు దేశం పార్టీ త‌ప్ప రాష్ట్రానికి ఎవ‌ర‌కు న్యాయం చెయ్య‌లేరని ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని ఆయ‌న తెలిపారు. ఏదో చేస్తాను అని ప్ర‌తి ప‌క్షం పైకి ఎగిరి అప్ర‌తిష్ట పాల‌యింద‌ని ఎద్దేవా చేశారు. నంద్యాల ఉప ఎన్నిక విజ‌యం సంధ‌ర్భంగా ఆయ‌న అమ‌రావ‌తిలో విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు.

విశ్వ‌స‌నీయ‌త‌ అవ‌కాశ‌వాద రాజ‌కీయాల ద్వారా రాదని చంద్ర‌బాబు తెలిపారు. తాను ఎన్నికలను మొదటిసారి ఎదుర్కొలేదని, చాలా సార్లు ఎదుర్కొన్నానని, కొత్తగా వచ్చిన వారు అర్థం కాకుండా అటు పరిగెత్తి.. ఇటు పరిగెత్తి.. ఏమి వెతుక్కోవాలో తెలియకుండా వాళ్లు బోర్ల‌బోక్క‌న‌ప‌డ్డారని వైసీపీ ని ఉద్దేశించిన చంద్రబాబు ఎద్దేవాచేశారు. జ‌గ‌న్‌ ఉప ఎన్నిక‌ల్లో హాద్దులు దాటి ప్ర‌వ‌ర్తించారన్నారు, ఆయ‌న మాట‌ల్లో ఎంటీ ఆ ఉన్మాదం, ఎంటీ ఆ దుర్మార్గం అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు, రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాలి, కానీ అవేశ‌ప‌డ‌కూడ‌దు అని సీఎం జ‌గ‌న్ కు సూచించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోతే ఎక‌గ్రీవం అనే సంప్ర‌దాయానికి తానే తెర‌లేపానన‌ని చంద్ర‌బాబు తెలిపారు, నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిని పెట్టి అభాసుపాల‌యింద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.  ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఒక్క ప్రాంతంలో 14 రోజులు ప్ర‌చారం  చేసిన దాఖ‌లు లేవని ఆయ‌న పెర్కోన్నారు, అయినా వైసీపీకి ఓట‌మి త‌ప్ప‌లేద‌ని ఆయ‌న పెర్కోన్నారు. డేరా బాబాలాగా మ‌న‌కి జ‌గ‌న్ బాబా త‌యార‌య్యాడని విమ‌ర్శించారు, స‌మాజానికి చాలా న‌ష్టం చేస్తున్నారన్నారు, ప్ర‌తిప‌క్షం అన్ని అభివృద్ది ప‌నుల‌కు అడ్డం ప‌డుతుద‌ని ఆయ‌న తెలిపారు, అయినా ప్ర‌జ‌ల కోసం చాలా ఓపిక ప‌డుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

 ఉప‌ ఎన్నిక‌ ఫ‌లితంతో ప్ర‌జ‌లు ఎమ‌నుకుంటున్నారో తెలిపోయింది. రాబోయో కాకినాడ ఎన్నిక మొద‌లుకొని 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేశారు.

 

 

 

మరిన్ని వార్తా విశేషాల కోసం క్లిక్ కింద క్లిక్ చేయండి 

 

Follow Us:
Download App:
  • android
  • ios