తిరుపతిలో  దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్వామివారి దర్శానికి వచ్చే భక్తులను దోచుకుంటున్నారు. నిలువు దోపిడీ చేసి గానీ వదలడం లేదు. తాజాగా.. ఓ యువకుడిని నిలువు దోపిడీ చేశారు. బాధితుడు ఫిర్యాదుతో ఈ దోపిడీ దొంగల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల ఓ యువకుడికి అమ్మాయిని ఎరగా వేసి  నిలువు దోపిడి చేశారు. నగదు, వస్తువులతో పాటు ఒంటిపై దుస్తులను దొంగలు దోచుకెళ్లారు. వారం క్రితం ఇలాంటి ముఠానే తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలను ఎరవేస్తూ... ఈ ముఠాలు దోపిడీలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ఓ ముఠాను అరెస్టు చేయగా.. మరో ముఠా దోపిడీలు చేస్తోందని పోలీసులు చెబుతున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని వారు చెప్పారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.