గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయంలోని పది లక్షల రూపాయల చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

సంక్షేమ కార్యక్రమాల కోసం నగదును ఆఫీసులో ఉంచినట్లు కార్యాలయ వర్గాలు చెప్పినట్లు అర్బన్ సిఐ నరేష్ కుమార్ తెలిపారు. కార్యాలయంలో పనిచేసినవారే అపహరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జూపూడి జాన్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

ఆళ్ల రామకృష్ణా రెడ్డి సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే.