వైసీపీ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.
ఓటీఎస్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదల మెడకు ఉరితాళ్లు వేస్తోందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం చంద్రబాబు నాయుడి అధ్యక్షతన టీడీపీ స్ట్రాటజీ కమిటీ సమావేశం నిర్వహించారు. పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాగా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో ప్రజలకు ఉపయోగపడే ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరలు అదుపులో ఉంచడంలో జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీని మొత్తం అప్పులమయైపోయిందని అన్నారు. దీంతో భవిష్యత్ తరాలు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఇంత వరకు ఏపీ ప్రభుత్వం రూ.6.8 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆ నిధులను ఎక్కడికి పోయాయని, ఏ స్కీమ్‌ల కు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పాటించారని ఆరోపించారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్‌లకు గ్రాంట్ ఇవ్వడం లేదని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నమ్మడం లేదని ఆరోపించారు. గవర్నమెంట్ సూచించిన పనులు చేసిన వారికి బిల్లులు రావడం లేదని అన్నారు. ప్రభుత్వ భూములు అమ్మేయడం పెట్టుబడుల ఉపసంహరణ లో భాగం కాదని తెలిపారు. సంక్షేమం పేరు చెప్పి జగన్ ఏపీ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల పేరు చెప్పి జగన్ దోచుకుంటున్నారని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.13,500 ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.7,500 ఇస్తున్నారని అన్నారు. తమ హయంలో రైతులకు లక్ష రూపాయిలు లబ్ది చేకూరిందని అన్నారు. వైసీపీ హయాంలో ఇరవై వేలు మాత్రమే అందుతోందని అన్నారు. రైతుల వ్యవసాయానికి అవసరమైన పరికరాలు ఇవ్వడం లేదని అన్నారు. నష్టపరిహారం కూడా అందించడం లేదని ఆరోపించారు. భారీ వర్షాల సమయంలో సహాయక చర్యలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిపారు. నష్టం జరిగిందనే విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి చెప్పలేదని ఆరోపిచారు. రైతు ఆత్మహ్యతల విషయంలో ఏపీని మూడో స్థానంలో నిలిపారని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలిపారని ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు దారుణంగా ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్య పర్చాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని తెలిపారు.
వైసీపీ నేత సుబ్బారావుపై సుభాని వర్గీయుల దాడి: వద్దని చెప్పానన్న మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి
తిరుపతిలో నిర్వహించిన సభ విజయవంతమైందని అన్నారు. జగన్ పాలనలో అమరావతి నాశనం చేశారని ఆరోపించారు. రెండు లక్షల కోట్లను నిర్వీరం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూడు రాజధానులు అంటూ వైసీపీ చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. దేశంలో మద్యం అమ్మకాల్లో ఏపీ మొదటి భాగంలో ఉందని అన్నారు. మద్యం తాగేందుకు వెనకాడాలని ధరలు పెంచామని చెపుతున్న సర్కార్ ఇప్పుడు మళ్లీ ఎందుకు తగ్గించిందని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల ద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదని అన్నారు.